హైదరాబాద్: 28°C
వార్తలు

నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం

AP: నటి కాదంబరి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జెత్వానీ కుటుంబ సభ్యుల పేర్లను నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ.. కోర్టులో CID పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఫిర్యాదుదారుడైన కుక్కల విద్యాసాగర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను న్యాయస్థానం AUG-12కు వాయిదా వేసింది.