హైదరాబాద్: 28°C
వార్తలు

ములుగులో గోదావరికి పోటెత్తిన వరద

TG: ములుగు జిల్లాలో గోదావరిలో వరద ఉద్ధృతి భారీగా పెరిగింది. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర అధికారులు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ గోదావరి నీటిమట్టం 17.32 మీటర్లకు చేరింది. జిల్లాలో వరద పరిస్థితిపై కలెక్టర్, ఎస్పీతో మంత్రి సీతక్క మాట్లాడారు. గోదావరి ప్రవాహాన్ని పరిశీలించాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.