హైదరాబాద్: 28°C
వార్తలు

గోదావరికి వరద.. ప్రభుత్వం అప్రమత్తం

AP: గోదావరి నదిలో పెరుగుతున్న వరద ఉద్ధృతితో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను హోంమంత్రి అనిత ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లా, మండలాల్లో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.