హైదరాబాద్: 28°C
వార్తలు

ఫ్యూచర్‌ సిటీకి 500 కంపెనీలు తెస్తాం: రేవంత్‌

TG: తమ పోటీ పక్క రాష్ట్రాలతో కాదని.. టోక్యో, న్యూయార్క్ వంటి నగరాలతో అని CM రేవంత్ అన్నారు. CII నార్తర్న్ రీజినల్ కౌన్సిల్ ప్రతినిధులతో CM సమావేశమయ్యారు. GCCల్లో 200 కంపెనీలు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ముందుకొచ్చాయని.. ఇక్కడికి ప్రపంచ ప్రఖ్యాత 500 కంపెనీలను తేవడమే లక్ష్యమని తెలిపారు. TGకు 3 బుల్లెట్ రైళ్లు రానున్నాయని.. ఇవి HYD నుంచి చెన్నై, పుణె, బెంగళూరుకు వెళ్తాయన్నారు.