హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళ నటుడు ఫిట్‌నెస్ రహస్యం ఇదే?

తమిళ నటుడు మొట్ట రాజేంద్రన్ 67 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాజారాణి సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో గుర్తింపు పొందారు. విలన్‌గా ప్రారంభమైన ఆయన కెరీర్‌ తర్వాత కామెడీ పాత్రలతో మెప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ప్రతిరోజూ వర్కౌట్స్ చేయడం తన ఆరోగ్య రహస్యమని, క్రమశిక్షణతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.