హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వరదలు.. 24 గంటలు తాటి చెట్టుపైనే రైతు 

ఒడిశాలోని భద్రక్ జిల్లాలో 76 ఏళ్ల రైతు త్రిలోచన్ సాహు వరదల్లో చిక్కుకుని 24 గంటలు తాటి చెట్టుపై గడిపాడు. పొలానికి వెళ్లిన ఆయన అకస్మాత్తుగా వచ్చిన వరదల నుంచి తప్పించుకునేందుకు చెట్టు ఎక్కాడు. కుమారుడి ఫిర్యాదుతో అధికారులు గాలింపు చేపట్టి, ఓడ్రాఫ్ బృందాల సహాయంతో ఆయనను సురక్షితంగా రక్షించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.