హైదరాబాద్: 28°C
వార్తలు

ఉగ్రదాడి.. వలస కార్మికుడు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులు జరపడం కలకలం రేపింది. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఇద్దరు వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బలగాలు కాల్పులు జరిగిన స్థలానికి చేరుకుని కూబింగ్ నిర్వహించారు. అలాగే క్షతగాత్రుడిని అసుపత్రికి తరలించారు.