హైదరాబాద్: 28°C
వార్తలు

సీఆర్‌పీఎఫ్‌ క్యాంపును ముంచెత్తిన వరద

ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నారాయణపూర్ జిల్లా ఆబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలోని బాలేవాడ CRPF క్యాంపును వరద ముంచెత్తింది. క్యాంపు మొత్తం నీటిలో మునిగిపోవడంతో చెట్లు, రేకుల షెడ్లపైకి జవాన్లు ఎక్కారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి జవాన్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు.