హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్‌ సైన్యం నిరంకుశంగా ప్రవర్తిస్తోంది: రణధీర్

పీవోకేలోని సామాన్య పౌరుల పట్ల పాక్‌ సైన్యం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ ఆక్షేపించారు. పీవోకేలోని ప్రజలను పాక్ రక్షణశాఖ మంత్రి శత్రువులుగా అభివర్ణించారని మండిపడ్డారు. ఆ తర్వాతే వారిపై సైన్యం దాడుల్ని తీవ్రం చేసిందని ధ్వజమెత్తారు. మరోవైపు భారత్‌ను దెబ్బతీసేందుకు పాక్ గతంలో ముజాహిదీన్లకు శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సమకూర్చిందన్నారు.