KRNL: మంత్రాలయం నియోజకవర్గంలోని అర్లబండ గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పార్టీ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజల మధ్య ఉంటూ.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
వార్తలు
మంత్రాలయంలో టీడీపీలో 50 కుటుంబాల చేరిక


