హైదరాబాద్: 28°C
వార్తలు

'యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

ATP: అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాలలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో 'నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్' కార్యక్రమం ఘనంగా జరిగింది. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జేఎన్‌టీయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా.జి.మమతా, జిల్లా యువజన అధికారి ఐశయ్య కోరారు. అనంతరం యువతతో ప్రతిజ్ఞ చేయించారు.