అన్నమయ్య జిల్లాలో అతి పెద్దది యలమరాజు చెరువులో చేపలు వేట చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించాలని చెరువు ఆయకట్టు గ్రామాల గిరిజనులు కోరారు. జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి నాగయ్యకు జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 450 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన చెరువులో ఒకే సహకార సంఘం చేపలు పడుతోందని తెలిపారు.
వార్తలు
'చేపలు పట్టడానికి మాకు అవకాశం కల్పించండి'


