రైలు టికెట్లతో పాటు అదనపు లగేజీని ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రయాణికులు ఇకపై పార్సిల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కన్ఫామ్ అయిన టికెట్లను బుక్ చేసుకునే సమయంలోనే IRCTC ద్వారా.. అదనపు లగేజీని కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈరోజు నుంచే ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
వార్తలు
రైళ్లలో అదనపు లగేజీకి ఆన్‌లైన్ బుకింగ్


