SS: పెనుకొండ షిరిడీ సాయి గ్లోబల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ శిల్పా అనుపాటి స్థానిక పాంచ్ బీబీ దర్గాను సందర్శించి చాదర్ సమర్పించారు. దర్గా అభివృద్ధికి తన కూతురు నవ్యశ్రీ చేతుల మీదుగా రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు సనావుల్లా, నిసార్, షఫీవుల్లా, జాబిలి చాంద్ బాషా తదితరులు పాల్గొని ఆమెను ఘనంగా సన్మానించారు.
వార్తలు
పాంచ్ బీబీ దర్గా సందర్శన


