పల్నాడు జిల్లా శావల్యాపురంలో జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని వైద్యాధికారి డాక్టర్ రాధాకృష్ణన్ ప్రారంభించారు. మొత్తం 167 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స సూచనలు అందించారు. శిబిరంలో పాల్గొన్న వారికి బీపీ, షుగర్‌తో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
వార్తలు
శావల్యాపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం


