హైదరాబాద్: 28°C
వార్తలు

'అర్బన్ హెల్త్ సెంటర్‌ను బలోపేతం చేయాలి'

NLG: నల్లగొండ పట్టణంలోని పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను విస్తరించి బలోపేతం చేయాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసుపత్రిని సందర్శించి, సమస్యలు తెలుసుకున్నారు. పాతబడిన భవనానికి మరమ్మతులు చేపట్టి, కిటికీలు, తలుపులు అమర్చాలన్నారు. రోగుల రద్దీకి తగినట్లు అదనపు వైద్య సిబ్బందిని, వసతులను కల్పించాలని కోరారు.