హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు సీఎంతో చర్చలు రద్దు: డీకే

కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి జలవివాదం ముదిరింది. దీనిపై సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య చర్చల వాతావరణం లేదని వెల్లడించారు. తమిళనాడు సీఎం విజయ్‌తో చర్చలను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతే నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కర్ణాటక బంద్ నిర్ణయాన్ని విరమించుకోవాలని విపక్షాలను కోరారు.