హైదరాబాద్: 28°C
వార్తలు

'విమానాశ్రయాన్ని మూసివేయడం తగదు'

AKP: విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని పరవాడ ఫార్మసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి డిమాండ్ చేశారు. శుక్రవారం పరవాడలో మాట్లాడుతూ విశాఖలో విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ గా ఉంచాలన్నారు. కూటమి నాయకులు విశాఖ విమానాశ్రయాన్ని మూసి వేయకుండా చూడాలన్నారు. సంవత్సరానికి 30 లక్షల మంది ప్రయాణించే విమానాశ్రయాన్ని మూసివేయడం తగదన్నారు.