హైదరాబాద్: 28°C
వార్తలు

పోచమ్మ, మైసమ్మకు ప్రత్యేక పూజలు

RR: కొందుర్గు మండలం చెక్కలోని గూడ గ్రామంలో శ్రీ పోచమ్మ, శ్రీ మైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొందుర్గు సర్పంచ్ ప్రభాకర్, డిప్యూటీ సర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యులు లక్ష్మి ముత్యాలు, బీఆర్ఎస్ యువనాయకుడు జి. విజయ్ కుమార్ పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు.