AKP: నక్కపల్లి మండలం అమలాపురం గ్రామ పరిధిలో స్మశాన భూములు, ప్రభుత్వ కాలువలు, చెరువుల ఆక్రమణలను తొలగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం గ్రామస్తులతో కలిసి ఆక్రమించుకున్న భూములను పరిశీలించారు. ఆర్సెలార్ మిట్టాల్ స్టీల్ ప్లాంట్ సబ్ కాంట్రాక్టర్ ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆక్రమణలను తొలగించాలన్నారు.
వార్తలు
'ఆక్రమణలను తొలగించాలి'


