హైదరాబాద్: 28°C
వార్తలు

ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

VZM: భోగాపురంలోని విమానాశ్రయ ప్రారంభోత్సవం నేపథ్యంలో రవాణా ఏర్పాట్లపై విజయనగరం కలెక్టరేట్‌లో మంత్రి పి. నారాయణ అధ్యక్షతన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. రవాణా శాఖ కమిషనర్ మహేష్ కుమార్ సిన్హా సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు.