హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

PLD: సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రజలు గృహం, పెన్షన్, వైద్యం తదితర సమస్యలపై వినతిపత్రాలు అందజేయగా, ఎమ్మెల్యే స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వారికి తెలిపారు.