BPT: బాపట్ల పోలేరమ్మ తల్లికి శుక్రవారం ఆషాఢ మాస ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి శాఖంబరి దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రజాక్షేమం కోరుతూ అర్చకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
వార్తలు
బాపట్లలో 'శాఖంబరి' దేవిగా అమ్మవారి దర్శనం


