హైదరాబాద్: 28°C
వార్తలు

మరో సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మరో కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. 'జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు 2026'పై ఎటువంటి చర్చ లేకుండానే దిగువ సభ ఆమోద ముద్రవేసింది. ఈ సవరణ బిల్లు ద్వారా జనన, మరణాల డిజిటల్ రిజిస్ట్రేషన్ విధిగా మారి, జాతీయ, రాష్ట్ర స్థాయి డేటాబేస్‌లు అనుసంధానమవ్వడానికి మార్గం సుగమం కానుంది.