VKB: యాలాల్ మండలం హాజీపూర్‌లో వ్యవసాయ శాఖ, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 43 బస్తాల నకిలీ డీఏపీ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. ఐఎఫ్‌ఎఫ్‌సీఓ బస్తాల్లో నింపి విక్రయించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎరువులు కొనుగోలు చేసే ముందు బిల్లు, లేబుల్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని రైతులకు సూచించారు.
వార్తలు
నకిలీ డీఏపీ ఎరువులు స్వాధీనం


