హైదరాబాద్: 28°C
వార్తలు

ఆధునిక రూపంలో సికింద్రాబాద్ స్టేషన్

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకుంటోంది. రూ.700 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టిన పునర్నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. ప్రయాణికుల సౌకర్యాల కోసం 140 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లు, స్మార్ట్ డిజిటల్ మానిటరింగ్, సౌర విద్యుత్ ప్లాంట్ వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.