హైదరాబాద్: 28°C
వార్తలు

దేశంలో మరో పేపర్ లీక్

నీట్ వివాదం వేడి చల్లారకముందే ఒడిశాలో మరో పరీక్షా పేపర్ లీక్ కావటం కలకలం రేపుతోంది. ఒడిశా వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలోని మెడికల్ పీజీ థియరీ పేపర్ పరీక్ష జరుగుతుండగానే వాట్సాప్ గ్రూప్‌లలో ప్రత్యక్షం కావడం దుమారం రేపుతోంది. ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు కూడా సర్క్యులేట్ అయినట్లు సమాచార. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.