హైదరాబాద్: 28°C
వార్తలు

ట్విన్ రిజర్వాయర్లకు వరద ప్రవాహం

HYD: పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలకు వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌కు 400 క్యూసెక్కులు, ఉస్మాన్‌సాగర్‌కు 150 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయాల నీటి మట్టాలను జలమండలి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికి గేట్లు ఎత్తే నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.