హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్‌పై మాట్లాడే అర్హత వారికి లేదు: మల్లాది

AP: కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు గుప్పించారు. జగన్ ఉత్తరాంధ్ర పర్యటనతో ప్రభుత్వ పెద్దలకు నిద్ర పట్టడం లేదన్నారు. 'జగన్‌కు వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. కూటమి మంత్రులకు జగన్‌పై మాట్లాడే అర్హత లేదు. తాము ప్రశ్న లేవనెత్తితే ఒక్క మంత్రి మాట్లాడరు. జగన్ పర్యటన చేస్తే మాత్రం మంత్రులు బయటకు వస్తారు' అని మండిపడ్డారు.