హైదరాబాద్: 28°C
వార్తలు

9న మోదకొండమ్మ జాతర

AKP: మాడుగుల మండలం కేజే.పురంలో ఆగస్టు 9న నిర్వహించనున్న శ్రీ మోదకొండమ్మ జాతర పోస్టర్‌ను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆవిష్కరించారు. జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్ హరిబాలకృష్ణ పాల్గొన్నారు.