హైదరాబాద్: 28°C
వార్తలు

గంధం అలంకరణలో కటాక్షించిన కరుమారియమ్మ

TPT: ఆడి మాస ఉత్సవాల్లో భాగంగా తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీ కరుమారియమ్మ ఆలయంలో అమ్మవారు ప్రత్యేక గంధం అలంకరణలో భక్తులను కటాక్షించారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు వేలాయుధం బృందం వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేక, పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.