హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఘనంగా శనగపాడులో సివిల్ రైట్స్ డే

NTR: పెనుగంచిప్రోలు మండలం శనగపాడు గ్రామ సచివాలయంలో శుక్రవారం సివిల్ రైట్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో కళ్యాణి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అబ్దుల్ హలీం, వీఆర్వో హారిక, పెనుగంచిప్రోలు పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.