హైదరాబాద్: 28°C
వార్తలు

ఆయిల్ పామ్ సాగు విస్తరణపై మంత్రి సమీక్ష

TG: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యాలను కంపెనీలు తప్పనిసరిగా సాధించాలని మంత్రి స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల పనుల పురోగతిని సమీక్షించారు. పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.