హైదరాబాద్: 28°C
వార్తలు

జర్నలిస్టుల కల నెరవేర్చిన ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం జర్నలిస్టుల ఏళ్ల నాటి ప్రెస్ క్లబ్ ఏర్పాటు కల ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చొరవతో నెరవేరింది. డిమాండ్ల దినోత్సవం వినతిపత్రం అందిన గంటలోనే స్పందించి ఆర్డీఓతో మాట్లాడి స్థలం కేటాయింపునకు చర్యలు తీసుకున్నారు. ప్లాన్ సిద్ధమైందని, త్వరలో భూమిపూజ నిర్వహిస్తామని తెలిపారు. జర్నలిస్టుల భీమా ప్రీమియాన్ని తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు.