హైదరాబాద్: 28°C
వార్తలు

కూలిన భవనం.. పెరిగిన మృతుల సంఖ్య

మహారాష్ట్రలోని భివండీలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన భవనంలో ఒక్కో అంతస్తులో 12 చొప్పున మొత్తం 48 గదులు ఉన్నట్లు తెలిపారు. ఈ భవనంలో పగుళ్లు రావడంతో దానిని ఖాళీ చేయాల్సిందిగా అక్కడి వారికి ఇది వరకే సూచించినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు.