హైదరాబాద్: 28°C
వార్తలు

కేరళం, గుజరాత్‌లో అతిభారీ వర్షాలు

కేరళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్, మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గుజరాత్‌లో కూడా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈరోజు అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. విద్యాసంస్థలన్నింటికీ సెలవు ప్రకటించారు.