హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మందుబాబులకు అడ్డాగా పాఠశాల

NLR: దేవాలయాలుగా భావించే విద్యాలయాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. రాత్రి సమయంలో మందుబాబులు మద్యం సేవిస్తూ పాఠశాలను అస్తవ్యస్తంగా తయారు చేశారు. బుచ్చి మండలం నాగమాంబపురంలోని ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. పాఠశాల అన్న భావన కూడా లేకుండా మందుబాబులు మద్యం సేవించడంపై ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.