హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్'

ASR: డుంబ్రిగుడలో 108 అంబులెన్స్ నిలిపే ప్రదేశంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరగడంతో పాటు వర్షపు నీరు చేరి బురదగా మారుతోంది. ఇటీవల షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఓ లైన్‌మన్ ప్రమాదానికి గురైన ఘటన ఆందోళన కలిగిస్తోందని, వెంటనే రక్షణ కంచె ఏర్పాటు చేసి పరిసరాలను శుభ్రపరచాలని స్థానికులు కోరుతున్నారు.