హైదరాబాద్: 28°C
వార్తలు

నీళ్లలోనే సంత.. ప్రజలకు కష్టం

NDL: గడివేములలో వర్షం వస్తే సంతమార్కెట్ చెరువులా మారుతోంది. ప్రధాన రహదారిలో ప్రతి గురువారం మార్కెట్ నిర్వహిస్తున్నారు. నిర్వహణకు దుకాణదారుల నుంచి ఏటా సుమారు రూ. 4 లక్షలు వసూలు చేస్తున్నారు. అయినా సౌకర్యాలు కల్పించడం లేదు. వర్షం పడితే సరకులు, కూరగాయలు తడిచిపోతున్నాయని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతమార్కెట్‌కు స్థలం కేటాయించి దుకాణాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.