AP: గోదావరి నదిలో వరదకు దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం వద్ద రాకపోకలు నిలిచాయి. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ 10.90 అడుగులకు చేరడంతో గేట్లు ఎత్తి 2.25 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. వరదకు కోనసీమ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పి గన్నవరం మండలంలో నదీపాయ తాత్కాలిక గట్టు తెగడంతో జి పెదపూడి, ఉడిమూడిలంక, అరిగేలవారిపేట, బూరుగులంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వార్తలు
ఉధృతంగా గోదావరి.. నిలిచిన రాకపోకలు


