హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో పారిశుధ్య పనులు ముమ్మరం..!

కృష్ణా: పెడన పట్టణంలోని 21, 22 వార్డుల్లో పారిశుధ్య పనులను మున్సిపల్ అధికారులు ముమ్మరం చేశారు. మున్సిపల్ కమిషనర్ డి. కొండయ్య పర్యవేక్షణలో రోడ్ల పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను సిబ్బంది తొలగించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారులను శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణం కల్పించే చర్యలు చేపట్టారు.