హైదరాబాద్: 28°C
వార్తలు

శెట్టూరులోనే వర్షం.. 31 మండలాల్లో నో రైన్

ATP: జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తాజాగా వెల్లడించారు. శెట్టూరు మండలంలో మాత్రమే వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. అక్కడ 5.4 మిమీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలోని మిగిలిన 31 మండలాల్లో ఎలాంటి వర్షం కురవలేదని చెప్పారు. జిల్లా సగటు వర్షపాతం 0.2 మిమీగా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.