హైదరాబాద్: 28°C
వార్తలు

'ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం'

PPM: సీతంపేట ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని కలెక్టర్ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దోనుబాయిలో మన్యం సవారీ బైక్‌ర్యాలీని ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. సున్నపుగెడ్డ జలపాతం వద్ద కట్టెలపొయ్యి వంటకాలను రుచి చూసిన వారు, పర్యాటక ప్రాంతాలకు రహదారులను త్వరలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.