హైదరాబాద్: 28°C
వార్తలు

కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

మహారాష్ట్రలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా, ఎనిమిది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భివండిలోని కోహినూర్ భవనంలో కొంతభాగం కూలిపోయిందని అధికారులు తెలిపారు. శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని వెలికితీశామని, గాయపడిన బాలుడిని రక్షించి ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రాంగణంలో మరమ్మతు పనులు జరుగుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.