హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్ ప్రమాదంలో వ్యక్తికి గాయాలు.

GNTR: పొన్నూరు మండలం మామిళ్ళపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్లకు చెందిన విలేఖరి షాజహాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తలలో రక్తం గడ్డకట్టిందని, అవసరమైతే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపినట్లు సన్నిహితులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.