హైదరాబాద్: 28°C
వార్తలు

నల్లవాగు ప్రాజెక్టుకు పెరిగిన వరద

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు మధ్యతరహా ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం పెరిగింది. భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి 1,138 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు AEE శ్రీవర్ధన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1493 అడుగులు కాగా ప్రస్తుతం 1487 అడుగులకు చేరిందని చెప్పారు.