హైదరాబాద్: 28°C
వార్తలు

బంగారం షాపులో ఎలుక దొంగతనం

బెంగళూరు సమీపంలోని తుమకూరులో ఉన్న ఒక నగల దుకాణంలో రూ.10 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు మాయమవ్వడంతో యజమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఆ నగలను దొంగిలించింది మనుషులు కాదు... ఒక ఎలుక అని తేలడంతో మరింత ఆశ్చర్యపోయారు. అది కన్నంలోకి లాక్కెళ్లిన 10 ఉంగరాలు, 2 గొలుసులను నేలను తవ్వి బయటకు తీశారు.