హైదరాబాద్: 28°C
వార్తలు

2.67 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

E.G: జిల్లాలో ఆగస్టు 1 న నిర్వహించనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బి.నగేష్ తెలిపారు. జూలై నెలకు సంబంధించిన మొత్తం 2,67,217 మంది లబ్ధిదారులకు రూ.1,18,08,64,000 చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఆరోజు ఉదయమే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు అందించేలా చర్యలు చేపట్టామన్నారు.