ADB: ఇచ్చోడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో బాబ్జిపేట్ గ్రామంలోని పలువురి రైతుల వ్యవసాయ పొలాలు నీట మునిగాయి. గ్రామానికి సమీపంలోని కడెం వాగు ఉదృతంగా ప్రవహించడంతో వరద నీరు చేనుల్లోకి చేరి పంటలు పూర్తిగా మునిగిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని గ్రామ రైతులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: భారీ వర్షానికి నీట మునిగిన పత్తి పంట


