హైదరాబాద్: 28°C
వార్తలు

ఆన్‌లైన్ పెట్టుబడి పేరుతో రూ. 25లక్షల మోసం

WNP: జిల్లా కేంద్రానికి చెందిన ఓ జీహెచ్ఎం ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. 25 లక్షలకు పైగా కోల్పోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై హరిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు అపరిచితుల పెట్టుబడి ఆఫర్లను నమ్మొద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.